NOTA Option Local Body Elections 2025: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే ఉన్న ఈ సదుపాయం ఇకపై బ్యాలెట్ పేపర్లలోనూ అందుబాటులోకి రానుంది. త్వరలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై నోటాను ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తుండగా ఈ నిర్ణయం తీసుకున్నారు.