హైదరాబాద్ టూర్‌లో ఉన్న కేంద్రమంత్రి అమిత్ షా.. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లతో భేటీ అంశం చర్చనీయాంశంగా మారింది. ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగే లంచ్ మీటింగ్‌కు వీరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. గతంలోనూ అమిత్ షాను చిరంజీవి, రామ్‌చరణ్ కలిశారు. ఇప్పుడు మరోసారి భేటీ వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమావేశం వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక.. ఆత్మీయ సమావేశమా అనేది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.