ఎమ్మెల్యే కాటిపల్లి మంచి మనసు.. సర్కార్ బడి పిల్లలకు రూ.4 కోట్లతో 6 వేల డ్యూయెల్ డెస్క్‌లు

3 weeks ago 5
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ.. కేపీ రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ద్వారా రూ. 4 కోట్ల వ్యయంతో 6 వేల డ్యూయల్ డెస్క్‌లను ప్రభుత్వ పాఠశాలలకు అందించేందుకు సిద్ధం చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు. సామాజిక సేవా రంగాల్లో ఆయన తన సొంత నిధులతో చేస్తున్న కృషి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article