Jubilee Hills MLA: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన భారీ విజయం, తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వానికి మరింత బలం చేకూర్చింది. ఈ గెలుపు జోష్‌లో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు త్వరలో మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేయవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ తెరపైకి వచ్చింది.