స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై శాసనమండలి చర్యలు తీసుకుంది. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు ఇద్దరినీ మండలి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టగా.. మూజువాణి పద్ధతిలో ఓటింగ్ అనంతరం సస్పెన్షన్ నిర్ణయం వెలువడింది. ఈ కేసులో అరెస్టైన ఇద్దరు ఎమ్మెల్సీలకు నాంపల్లి కోర్టు రిమాండ్ తిరస్కరించి బెయిల్ ఇచ్చింది.