ఎలక్ట్రానిక్ కాంటాకు తగిలి 10 నెలల చిన్నారి మృతి.. జగిత్యాలలో తీవ్ర విషాదం

1 hour ago 1
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఎలక్ట్రానిక్ కాంటాకు తగిలి 10 నెలల చిన్నారి కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు పోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇంట్లో ఆడుకుంటున్న ఆ చిన్నారి ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రానిక్ కాంటాకు తాకడంతో చిన్నారికి విద్యుత్ షాక్ తగిలింది. చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించిన తండ్రికి కూడా షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. పసిపాప మృతితో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Read Entire Article