Rachakonda Police: హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని ప్రభుత్వం, పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటే.. స్మగ్లర్లు మాత్రం చాప కింద నీరులా డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ సైలెంట్‌గా దందా సాగిస్తూనే ఉన్నారు. ఎవ్వరికీ కనీసం అనుమానం కూడా రాకుండా రకరకాల మార్గాల్లో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అని నివ్వెరపోయేలా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.