ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే తక్కువ స్థాయి వర్షపాతం నమోదయ్యింది. ఇది వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రైతాంగం భారీగా నష్టపోయే పరిస్థితులు నెలకున్నాయి. ఇక, నిత్యావసరాలపై కూడా దీని ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. పేదలకు ఉచితంగా నిత్యావసరాలను అందించే మరో పథకానికి సన్నాహాలు చేస్తోన్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఉమ్మడి ఏపీలో 2013లో అమ్మ హస్తం పథకం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.