ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు.. యాసంగి పంటలు వేయొద్దని సర్కార్ విజ్ఞప్తి

2 hours ago 1
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. సాగునీటి లభ్యత తగ్గితే వ్యవసాయంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలపైనా ప్రభావం పడవచ్చని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటలు సాగు చేసిన రైతులకు నీరు అందించి పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తామని చెబుతూనే.. రెండో పంట వేసి నష్టపోవద్దని యాసంగి సాగుపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు పొదుపు అవసరమని ప్రభుత్వం సూచిస్తోంది. నీటి వృథాను అరికట్టడం, ప్రజల్లో అవగాహన పెంచడం, కరువు ప్రభావిత ప్రాంతాలకు ఆర్థిక సాయం కోరడం వంటి చర్యలతో రాబోయే నెలల సవాళ్లను ఎదుర్కోవాలని యోచిస్తోంది.
Read Entire Article