తిరుమల తిరుపతి ఆలయంలో వెనుక సుమారు ఏడున్నర ఎకరాల కర్ణాటక గెస్ట్‌హౌస్‌ని అక్కడి దేవాదాయ శాఖ నుంచి టూరిజం శాఖకు బదిలీ చేయడం వివాదానికి దారితీసింది. ఈ సముదాయంలోని ప్రవాస సౌధ భవనాల నిర్వహణను ఇకపై కర్ణాటక పర్యాటక అభివృద్ధి సంస్థ చేపడుతుందని ఆ సంస్థ ఎండీ శివప్రసాద్ ప్రకటించారు.అయితే రూల్స్‌కు విరుద్ధంగా భక్తుల సత్రాలను పర్యాటక సంస్థకు అప్పగించే ఈ నిర్ణయాన్ని టీటీడీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం గనుక సరైన వివరణ ఇవ్వకపోతే ఆ ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.