ఎల్‌నినో ప్రభావంతో రానున్న నెలల్లో వర్షాభావం, నీటి కొరత, వ్యవసాయ, విద్యుత్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే ఎనిమిది నెలలకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నీటి పొదుపు, పంటలకు నీటి లభ్యత, విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సాయం, రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోసం చేసిన విజ్ఞప్తిని ప్రస్తావించారు. అదనపు ఉపాధి దినాలు, వార్‌రూమ్, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటుపైనా దృష్టి సారించారు.