నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఏపీలో టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పలువురు సీనియర్ నేతల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయి. దీనిపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది. బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అయితే ఏపీ మంత్రి మరో అడుగు ముందుకేశారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి టీజీ భరత్... పారిశ్రామికవేత్తలతో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.