ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఇటీవల కల్వకుంట్ల కవితను బహిష్కరించింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఊరు ఎవ్వరి జాగీరు కాదని చెప్పారు. తన కుటుంబం నుంచి తనను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొందరు వ్యక్తులు చింతమడక, సిద్ధిపేటను తమ సొంత ఆస్తి అనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు కవిత.