కేన్సర్ భూతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏటా ఈ మహమ్మారి బారినపడేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే, ఏఖంగా ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారినపడటం సంచలనంగా మారింది. అదే, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం. ఆ గ్రామంలో ఓ వీధిలో చూసినా.. ఎవర్ని కదిపినా..కన్నీటి కథలే వినిపిస్తాయి. ఈ విషయాన్ని అనపర్తి ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఇప్పుడు బలభద్రపురం గ్రామం గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.