ఏనుగు రూపంలో పంది పిల్ల జననం.. బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా..?

3 days ago 2
నాగర్‌కర్నూల్ జిల్లా కార్పాముల గ్రామంలో ఒక పంది ఏనుగు ఆకారాన్ని పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏనుగు మాదిరిగా తొండం, పెద్ద చెవులతో ఉన్న ఈ వింత పంది పిల్లను చూసేందుకు జనం క్యూ కట్టారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందని స్థానికులు భావిస్తుండగా.. ఇది జన్యులోపం వల్ల జరిగిన ఘటన అని డాక్టర్లు పేర్కొన్నారు. పుట్టిన కాసేపటికే ఆ వింత పందిపిల్ల మరణించగా.. మిగిలిన ఐదు పిల్లలు క్షేమంగా ఉన్నాయని వాటి యజమాని తెలిపారు.
Read Entire Article