ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం 'స్త్రీ శక్తి' పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. రోజుకు సుమారు 21 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత రద్దీ పెరగడంతో.. ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..