Ap Coconut Farmers Rs 1000 For Plant:ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కొబ్బరి రైతుల్ని ఆదుకుంటామని.. చెడిపోయిన ప్రతి మొక్కకు వెయ్యి సాయం.. కొత్త మొక్కలు నాటిస్తామన్నారు. కాలువలలో పూడిక తీయకపోవడంతో కొబ్బరి తోటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందుకే ముందు కాలువలలో పూడిక తీయడంపై ఫోకస్ పెట్టామన్నారు. ఆ తర్వాత పాడైపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు పెట్టిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.