2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వివరాలను కాగ్ విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన పన్నుల రాబడిలో ఇప్పటికే సగం వరకు సాధించింది ఏపీ. ఏడు నెలల్లోనే రూ. 82,983.17 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 42.04 శాతం. అయితే, రెవెన్యూ లోటు అంచనాల కంటే 44 శాతం అధికంగా ఉండటం గమనార్హం. ఇక ఏడాది మొత్తానికి రూ. 79,926 కోట్లు అప్పు తీసుకుంటామని బడ్జెట్‌లో చెప్పారు. కానీ ఏడు నెలల్లోనే రూ. 67,283 కోట్ల నికర రుణాలు తీసుకున్నారు.