ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. మండల, మున్సిపల్, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణాధికారులను నియమించనుంది. తొలి దశలో మండల స్థాయి పర్యవేక్షకుల నియామకం త్వరలో పూర్తి కానుంది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో చేరతాయని, సచివాలయాల పనితీరులో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.