ఏపీలో ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రవ్యా్ప్తంగా బుధవారం ఉదయం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు.. 9 మంది లబ్ధిదారులకు సుమారుగా రూ.18 లక్షలు పింఛన్ డబ్బులు అందించారు. కోర్టు ఆదేశాలతో పింఛన్ తొలగించినప్పటి నుంచి వారికి ఇవ్వాల్సిన పింఛన్ మొత్తాన్ని లెక్కగట్టి 18 లక్షల రూపాయలు అందజేశారు.