New App For Government Services Un Andhra Pradesh: మన మిత్ర ద్వారా ఏపీ ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్ లైన్ లో వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్టీజీఎస్, క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఆర్టీజీఎస్, అవేర్ వంటి వ్యవస్థలతో పరిపాలనలో కొత్త విధానాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నామని.. కేంద్రం ఈ తరహా పద్దతులను అమలు చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు చంద్రబాబు.