వాయూవ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడిందని, ఆ ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తరాంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలిపింది. దాంతో తీరం వెంట 40 - 50 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. హోం, విపత్తుల శాఖ మంత్రి అనిత కూడా దీనిపై అధికారులను అప్రమత్తం చేశారు.