Sapta Jyotirlinga Darshan Yatra: విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రను ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీల్లో భాగంగా ప్రత్యేక రైలు ప్లాన్ చేశారు. ఈ యాత్రల 12 రోజుల పాటు ఉజ్జయిని, ద్వారకా, సోమ్‌నాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్ మీదుగా కొనసాగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లలో బోర్డింగ్ సదుపాయం కూడా కల్పించారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభమయ్యే సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర 11 రాత్రులు, 12 పగళ్లు ఉంటుంది.