Vijayawada Traffic Diversions: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా మే 2న ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. చెన్నై, విశాఖపట్నం వెళ్లే వాహనాలను మళ్లిస్తున్నారు. భారీ వాహనాలను నిలిపివేసి, రాత్రి 9 గంటల తర్వాత అనుమతిస్తారు. ప్రయాణికులు సహకరించాలని పోలీసులు కోరారు.