AP Govt Collect Only 50% Of Vacant Land Tax: ఏపీ ప్రభుత్వం ఖాళీ స్థలాలపై విధించే వీఎల్‌టీ (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్)ను 50శాతం తగ్గించింది. నిర్మాణ కాలంలో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాయితీ చట్టబద్ధంగా భవన నిర్మాణ అనుమతి పొందిన స్థలాలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే అనధికార నిర్మాణాలు, చట్టబద్ధ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు ఈ రాయితీ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.