రోడ్డు ప్రమాదాలు, పాము కాట్లు వంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ చాలా ముఖ్యం. ఇలాంటివి జరిగిన గంటలోపే ఆసుపత్రులకు తీసుకెళ్తే.. గాయాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా బాధితులకు ప్రాణాపాయం కూడా తగ్గుతుంది. అందుకోసం అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రాష్ట్రంలో అంబులెన్స్‌ల కొరత, పాత వాహనాల సమస్యను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 190 కొత్త 108 వాహనాలను ప్రారంభించన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దీంతో రోగులకు, క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.