ఐదుగురు ఐఏఎస్ అధికారులకు కేంద్ర పరిపాలన ట్రైబ్బునల్ షాక్ ఇచ్చింది. సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం రేపు సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలంటూ ఏపీ, తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారులకు కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, సృజన, వాణీప్రసాద్ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై క్యాట్ తీర్పు ఇచ్చింది.