Andhra Pradesh High Temperatures Heat Waves: ఏపీలో మరో వారం పాటూ భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఈ నెల 19 నుంచి 24 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏకంగా 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందంటున్నారు. ఎండకు తోడు వేడిగాలులు వీచే అవకాశం ఉంది అంటున్నారు. ఈ వారం పాటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు.