Vijaya And Sangam Dairy Milk Rates: ఏపీలో విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచారు. విజయ డెయిరీకి సంబంధించి లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. విజయ డెయిరీకి సంబంధించి ఈ ధరలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అమల్లో ఉంటాయి. ఈ నెల 4 నుంచి అమల్లోకి వస్తాయి. సంగం డెయిరీకి సంబంధించి పెంచిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.