Andhra Pradesh Earth Hour: ప్రతి ఏటా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ జరుపుకుంటారు. ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఇవాళ ఒక గంట పాటు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపేసి ఎర్త్ అవర్ పాటించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు రాత్రి 8.30గంటల నుంచి 9.30గంటలకు డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపేయాలన్నారు. వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించొచ్చు అంటున్నారు.