ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశించింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై ఏపీ ప్రభుత్వం విచారణ అథారిటీని నియమించింది. ఇందులో ఆర్పీ సిసోదియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్‌పై ఏసీబీ డీజీకి మరో లేఖ రాశారు.