రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కారవాన్ టూరిజం ప్రోత్సహిస్తోంది. అల్లూరి జిల్లాలో కారవాన్ టూరిజం, కారవాన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే ట్రయల్ రన్‌లో భాగంగా హైదరాబాద్ నుంచి ఆదివారం లంబసింగికి కారవాన్ వాహనం చేరుకుంది. కారవాన్ ట్రయల్ రన్ సక్సెస్ అయితే భవిష్యత్తులో లంబసింగి, తాజంగిలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.