GV Reddy Key Decision On Employees: ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కొందరు కేబుల్ ఆపరేటర్లపై రూ.100 కోట్లు పెనాల్టీలు వేశారని.. అవన్నీ మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో వినియోగదారులకు రెంటల్ పేరిట బాక్స్‌లు ఇచ్చారని.. వారి నుంచి ప్రతి నెల ప్రతి కనెక్షన్‌కు రూ.59ల చొప్పున అక్రమంగా వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెంటల్స్ వసూలు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు.