వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నేరుగా పది, ఇంటర్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. గడువు ముగిసినా రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ కార్యక్రమంలో చేరితే ఉచిత పుస్తకాలు ఇస్తారు. యూట్యూబ్, వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ అన్ని బోర్డులతో సమానమైన గుర్తింపు గల సర్టిఫికెట్లను సార్వత్రిక విద్యాపీఠం అందిస్తు్ంది.