Amaravati World Bank Loan Approved: ఏపీ రాజధాని అమరావతికి తీపికబురు అందింది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. రూ. 6 వేల 750 కోట్లు రుణం ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసినట్లు ఏపీ ప్రభుత్వానికి గత రాత్రి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అమరావతికి రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. విడతల వారీగా ఈ రుణాల్ని మంజూరు చేస్తారు.