Chennai Bangalore Expressway Works Speed Up: ఏపీ మీదుగా వెళ్లే మరో ఎక్స్‌ప్రెస్ వే పనులు ముగింపు దశకు వచ్చాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడును కనెక్ట్ చేస్తున్న చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే పనులు చిత్తూరు జిల్లాలో వేగంగా కొనసాగుతున్నాయి. మరో ఐదు నెలల్లో ఈ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే గంటన్నరలోనే అటు బెంగళూరు, ఇటు చెన్నైకి వెళ్లొచ్చు.