రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలోగా రైతుల అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే తాజాగా ఏరోజు కారోజు డబ్బులు చెల్లించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఉదయం రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే.. సాయంత్రానికల్లా అతని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.