Chandrababu Naidu Orders On Paddy Procurement: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. వికేంద్రీకరణ విధానంలో రైతు సేవా, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈ-పంట, ఈకేవైసీ ద్వారా కొనుగోళ్లు చేస్తారు. ఖరీఫ్ సీజన్‌లో 37లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ధాన్యం కొనుగోళ్లపై చంద్రబాబు సమీక్ష చేశారు. అలాగే అధికారులకు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు.