వరి రైతులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంక్రాంతి వరకూ పొడిగిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. అలాగే 2300 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని మంత్రి వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఖరీఫ్ సీజన్‌లో పండిన ప్రతి ధాన్యం బస్తాను కూడా కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు హామీ ఇచ్చారు.