ఏపీ వాసులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. గత వైసీపీ సర్కారు అమలు చేసిన పలు పథకాల పేర్లను టీడీపీ కూటమి సర్కారు మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగనన్న కాలనీలు పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. జగనన్న కాలనీల పేరును పీఎంఏవై - ఎన్టీఆర్ నగర్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అమ్మ ఒడి, జగనన్న భూ రక్ష, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి పథకాల పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.