సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడపడానికి సిద్ధమవుతోంది. బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి జనవరి 9 నుంచి 13 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతి సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు ఉపశమనం కలిగించనున్నాయి.