No bag day in AP schools Every Saturday: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు బ్యాగుల మోత తప్పించేలా నో బ్యాగ్ డేను అమలు చేయనుంది. అయితే ఇప్పటికే ప్రతి నెలా మూడో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తున్నారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతీ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు క్విజ్‌లు, డిబేట్లు, సదస్సులు, క్రీడలు, పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.