AP Local Body Elections Alliance Seat Sharing: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఎవరు ఎన్ని చోట్ల, ఎక్కడెక్కడ పోటీచేయాలో ఖరారైనట్లు తెలుస్తోంది. 4 కార్పొరేషన్లు, 20కిపైగా మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఒక కార్పొరేషన్, ఆరుకుపైగా మున్సిపాలిటీల్లో పోటీచేయనున్నట్లు సమాచారం. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.