ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ముప్పవరం నుంచి కాజా వరకు 100 కిలోమీటర్ల భాగాన్ని యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఈ హైవేపై వాహనాల రద్దీ దృష్టిలో పెట్టుకుని.. యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు టెండర్లు పిలిచింది. టెండర్ పొందిన కంపెనీ ఈ డీపీఆర్ పనులు ప్రారంభిస్తుంది.