Mangalagiri AIIMS Exit Ramp Green Signal: మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లే వారి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. మంగళగిరి వద్ద జాతీయ రహదారి 16పై ఉన్న ఎంట్రీ ర్యాంప్‌ను ఎగ్జిట్ ర్యాంప్‌గా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఎయిమ్స్‌కు వెళ్లే దూరం గణనీయంగా తగ్గనుంది. అంతేకాకుండా జాతీయ రహదారిపై 13 దిశానిర్దేశిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.