Ap Weather Today: తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని. ఈ ప్రభావంతో అక్టోబరు 24, 25న ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.