ఏపీకి మరో జాతీయ సంస్థ రానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఈ విషయమై చర్చించారు. విశాఖపట్నం లేదా అమరావతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలంటూ అమిత్ షాను కోరారు. దీనిపై వినతి పత్రం కూడా కేంద్ర మంత్రికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనపై అమిత్ షా సానుకూలంగా స్పందించారని లావు శ్రీకృష్ణ దేవరాయలు ట్వీట్ చేశారు.