AP Government MoU With People Tech Enterprises: ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టా్త్మక ప్రాజెక్టు రానుంది. ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. శుక్రవారం ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం రూ.1800 కోట్లతో 1200 ఎకరాల్లో ఓర్వకల్లులో ఈ ప్రైవేట్ వెహికల్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తి అయితే 25 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.