Andhra Pradesh Green Ammonia Production Plant: ఆంధ్రప్రదేశ్‌కు ఒక శుభవార్త! మూలపేట పోర్టు దగ్గర భారీ గ్రీన్ అమ్మోనియా తయారీ ప్లాంటు రాబోతోంది. రెండు విదేశీ కంపెనీలు చేతులు కలిపి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. దీని ద్వారా పర్యావరణానికి మేలు జరిగేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికంగా మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్లాంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.