ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడి.. గూగుల్‌తో ఒప్పందం, 1.88 లక్షల ఉద్యోగాలు

4 months ago 15
ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ హబ్‌గా మార్చేందుకు విశాఖపట్నంలో కీలక ముందడుగు పడింది. వైజాగ్‌లో 1 గిగావాట్ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఒప్పందంపై ఇరు వర్గాల ప్రతినిధులు సంతకాలు చేశారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అసియాయాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ నిర్మించనుంది గూగుల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2028-2032 మధ్య రాష్ట్ర జీడీపీకి ఏటా రూ.10,518 కోట్లు, 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనాలు ఉన్నాయి.
Read Entire Article